Elon Musk: అపర కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ పైపైకి..!

  • రెండోస్థానానికి చేరిన టెస్లా అధినేత
  • బిల్ గేట్స్ ను వెనక్కినెట్టిన మస్క్
  • మస్క్ సంపద విలువ 127.9 బిలియన్ డాలర్లు
Elon Musk reach to number two position in world richest

టెక్నాలజీయే దన్నుగా నూతన ఆవిష్కరణలు, రోదసి యానం, విద్యుత్ ఆధారిత కార్లు వంటి వ్యాపారాలతో ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ (49) లాభాల బాటలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో రెండోస్థానానికి ఎగబాకారు. ఈ క్రమంలో ఆయన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను సైతం వెనక్కినెట్టారు. మస్క్ నికర సంపద విలువ 127.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. బిల్ గేట్స్ ఆదాయం 127.7 బిలియన్ డాలర్లు.

మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల మార్కెట్ విలువ ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. స్టాక్ మార్కెట్లలో మస్క్ కు చెందిన సంస్థల షేర్ల విలువ మరింత మెరుగైంది. ఈ ఒక్క ఏడాదే మస్క్ ఆస్తి 100 బిలియన్ డాలర్లు పెరిగిందంటే టెస్లా, స్పేస్ ఎక్స్ ల ప్రస్థానం ఎంత ఉజ్వలంగా ఉందో అర్థమవుతుంది. ఇక ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ ప్రస్తుతం 190 బిలియన్ డాలర్లు.

More Telugu News