Ramnath Kovind: తిరుమలలో ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో రాష్ట్రపతికి పూర్ణకుంభ స్వాగతం

President Ramnath Kovind visits Tirumala shrine

  • కుటుంబసమేతంగా తిరుమల విచ్చేసిన రామ్ నాథ్ కోవింద్
  • సంప్రదాయబద్ధంగా స్వామివారి దర్శనం
  • రాష్ట్రపతికి శ్రీవారి శేషవస్త్రం బహూకరించిన ఆలయ వర్గాలు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఇవాళ తిరుమల విచ్చేసిన సంగతి తెలిసిందే. సంప్రదాయాన్ని అనుసరించి రామ్ నాథ్ కోవింద్ దంపతులు తిరుమలలో మొదట వరాహస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆ తర్వాత వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు ఇస్తికఫాల్ ఆలయమర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలోని రంగనాయక మంటపం వద్ద రాష్ట్రపతి వేదపండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. దర్శనం అనంతరం రామ్ నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులకు ఆలయ వర్గాలు తీర్థప్రసాదాలను, స్వామివారి శేషవస్త్రాన్ని అందజేశాయి.

Ramnath Kovind
Tirumala
TTD
President Of India
India
  • Error fetching data: Network response was not ok

More Telugu News