Atchannaidu: వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు: నిమ్మగడ్డకు అచ్చెన్నాయుడు లేఖ

atchannaidu writes letter to nimmagadda
  • ప్రతిపక్ష నాయకులపై వైసీపీ నేతల దాడులు
  • స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చర్యలు
  • హత్యారాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
  • సీబీఐ విచారణ జరగాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకులపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సంతమాగులూరు మండలంలో వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.
 
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగిన టీడీపీ అభ్యర్థులపై ఈ దాడులు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన కోరారు. ప్రతిపక్ష అభ్యర్థులకు కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలని, ఆన్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన చెప్పారు.

అలాగే, దాడుల నుంచి రక్షణ కోసం కేంద్ర భద్రతా దళాల సహకారంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. హత్యారాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వైసీపీ నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరగాలని కోరారు.
Atchannaidu
Telugudesam
Nimmagadda Ramesh Kumar

More Telugu News