IYR Krishna Rao: అలా చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుంది: టీఆర్ఎస్ నేతలకు ఐవైఆర్ సూచన

iyr slams trs

  • జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలపై ఐవైఆర్ స్పందన 
  • తాము అధికారంలోకి రాకపోతే ‘మతకలహాలు’ అని అంటున్నారు
  • అధికారంలో లేకపోయినా మత కలహాలు లేకుండా చూడాలి 

గ్రేటర్ హైదరాబాద్‌లో వచ్చేనెల 1న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతోన్న విషయం తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జోరుగా ప్రచారం చేస్తుండడంతో టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ గెలిస్తే మత కలహాలు ప్రారంభమవుతాయంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు.

‘మేము అధికారంలోకి రాకపోతే మతకలహాలు అని బెదిరించే బదులు మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మత కలహాలు లేకుండా చూస్తామని చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుంది’ అని ఐవైఆర్ కృష్ణారావు సలహా ఇచ్చారు.

IYR Krishna Rao
TRS
GHMC Elections
  • Loading...

More Telugu News