naga Chaitanya: లుంగీ కట్టిన నాగచైతన్య... ‘లవ్ స్టోరీ’ నుంచి మరో పోస్టర్ విడుదల

  • శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ'  
  • నాగచైతన్య సరసన నాయికగా సాయి పల్లవి
  • నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల  
Chaitanya lovestory new poster

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి నటిస్తోన్న 'లవ్ స్టోరీ' సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా దీన్ని విడుదల చేస్తున్నట్లు శేఖర్ కమ్ముల చెప్పారు. లుంగీ, బనియన్ వేసుకుని నాగచైతన్య పల్లెటూరి యువకుడిలా కనపడుతున్నాడు.

కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్, ఈమధ్యే పూర్తయింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, తొలి పాటకు మంచి స్పందన వచ్చింది. నాగచైతన్య , సాయి పల్లవి ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనపడతారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

More Telugu News