sri mani: పదేళ్లుగా ప్రేమిస్తోన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న గేయ రచయిత శ్రీమణి

srimani gets married

  • ప్రేమికురాలు ఫ‌రాతో వివాహం
  • తమ క‌ల నిజ‌మైందని వ్యాఖ్య
  • తమను అర్థం చేసుకున్న త‌ల్లిదండ్రుల‌కి థ్యాంక్స్

పలు హిట్ పాటలను రాసిన సినీ గేయ రచయిత శ్రీమణి ఒక ఇంటివాడయ్యాడు. ప‌దేళ్లుగా తాను ప్రేమిస్తోన్న అమ్మాయి ఫ‌రాను పెళ్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు. ఫ‌రాకు తన జీవితంలోకి స్వాగతం చెబుతున్నానని, తాము గ‌త ప‌దేళ్లుగా ఈ క్ష‌ణం కోసం ఎదురు చూశామని తెలిపాడు.

తమ క‌ల నిజ‌మైందని, తమ హృదయాలను అర్థం చేసుకున్న దేవుడికి, త‌ల్లిదండ్రుల‌కి ధ‌న్య‌వాదాలని  శ్రీమ‌ణి అన్నాడు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 
 
ఆయన రొమాంటిక్ లిరిక్స్ వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు అర్థమైందంటూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. కాగా, ‘100% లవ్’ సినిమాతో గేయ రచయితగా చిన్న వయసులోనే టాలీవుడ్‌కి శ్రీమణి పరిచయమయ్యాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఎన్నో సినిమాలకు పాటలు రాశాడు. తాజాగా, ‘ఉప్పెన’, ‘రంగ్‌దే’ వంటి సినిమాలకు శ్రీమణి పాటలు రాశాడు. తమ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాటలు రాసి, ఎన్నో అవార్డులను అందుకున్నాడు.
  

sri mani
Tollywood
devi sri prasad
  • Loading...

More Telugu News