Telangana: మేం తలచుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ సర్కారు కుప్పకూలుతుంది: ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Mumtaz Ahmed Khan sensational comments on kcr govt

  • కేటీఆర్ చిలకలాంటోడు, నిన్ననే కళ్లు తెరిచాడు
  • మాకు గద్దెనెక్కించడం, దించడం రెండూ తెలుసు
  • రాజకీయం మా ఇంటి గుమ్మంలో బానిసలాంటిది

అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌పై మజ్లిస్‌కు చెందిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కనుక తలచుకుంటే ప్రభుత్వం రెండు నెలల్లోనే కూలిపోతుందని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నిన్న చార్మినార్‌ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన మాట్లాడుతూ.. నిన్నమొన్న రాజకీయాల్లోకి వచ్చి చిలకపలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.

తాము ఇలాంటి వారిని ఎంతోమందిని చూశామని అన్నారు. మజ్లిస్ బలమైన పార్టీ అని, తమకు గద్దెనెక్కించడం తెలుసు, దించడం కూడా తెలుసని అన్నారు. తామెవరికీ భయపడబోమని, కేటీఆర్ చిలకలాంటోడని, నిన్ననే కళ్లు తెరిచాడని అన్నారు. సలావుద్దీన్ ఒవైసీ అన్నట్టు రాజకీయం తమ గుమ్మంలో బానిసలాంటిదని ముంతాజ్‌ఖాన్ వ్యాఖ్యానించారు.

Telangana
KCR
KTR
TRS
MIM
Mumtaz Ahmed Khan
  • Loading...

More Telugu News