ఏపీ కరోనా అప్ డేట్: 1,121 పాజిటివ్ కేసులు, 11 మరణాలు

22-11-2020 Sun 18:58
  • గత 24 గంటల్లో 71,913 టెస్టులు
  • అత్యధికంగా గుంటూరు జిల్లాలో 164 కేసులు
  • కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 21 కేసులు
  • తాజాగా 1,631 మందికి కరోనా నయం
AP Corona cases and details

ఏపీలో గడచిన 24 గంటల్లో 71,913 కరోనా టెస్టులు నిర్వహించగా 1,121 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 164 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 21 కేసులు గుర్తించారు. అదే సమయంలో 11 మంది మరణించగా 1,631 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,62,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,41,026 మంది కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 14,249 మంది చికిత్స పొందుతున్నారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 6,938కి పెరిగింది.