'సండే క్విజ్' అంటూ నెటిజన్లకు ప్రశ్నాస్త్రం సంధించిన సంచయిత

22-11-2020 Sun 16:31
  • మోతీమహల్ ను కూల్చాలని ఆదేశాలిచ్చిందెవరన్న సంచయిత
  • సరైన సమాధానాలను తాను రీట్వీట్ చేస్తానని వెల్లడి
  • ఇటీవల ట్విట్టర్ లో సండేక్విజ్ నిర్వహిస్తున్న సంచయిత
Sanchaita Gajapathi asks people in the name of sunday quiz

మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ సంచయిత గజపతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సండేక్విజ్ అంటూ సంచయిత నెటిజన్లను పలు ప్రశ్నలు అడుగుతుంటారు. తాజాగా ఈ ఆదివారం కూడా ఓ ప్రశ్న సంధించారు.

150 సంవత్సరాల పురాతన వారసత్వ చారిత్రక ప్యాలెస్ మోతీమహల్ ను కూల్చివేయమని ఆదేశాలు ఇచ్చినప్పుడు మాన్సాస్ చైర్మన్ ఎవరు అంటూ సంచయిత ట్వీట్ చేశారు. మోతీమహల్ ను పునరుద్ధరించాలని ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియాను కోరకుండా కూల్చివేత ఆదేశాలు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. సరైన సమాధానాలు ఇచ్చినవారి ట్వీట్లను వచ్చే ఆదివారం వరకు రీట్వీట్ చేస్తానని వెల్లడించారు.