Password: ప్రపంచంలో అత్యంత చెత్త పాస్ వర్డ్ లు ఇవేనట!

  • సులువైన పాస్ వర్డ్ లతో జాబితా రూపొందించిన నార్డ్ పాస్
  • తేలిక పాస్ వర్డ్ లను హ్యాకర్లు సులువుగా ఛేదిస్తారని వెల్లడి
  • పాస్ వర్డ్ లో నెంబర్లు, సింబల్స్ కూడా ఉండాలని సూచన
Here is world worst passwords

ఇది ఇంటర్నెట్ యుగం. ఇందులో ప్రతి ఖాతాకు పాస్ వర్డ్ లే రక్ష. అయితే పాస్ వర్డ్ ఎంత బలంగా ఉంటే అకౌంట్లకు అంత భద్రత ఉంటుంది. తేలిగ్గా ఊహించగలిగే పాస్ వర్డ్ లను హ్యాకర్లు సులభంగా ఛేదిస్తుంటారు. అందుకే పాస్ వర్డ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఇక, అసలు విషయానికొస్తే... నార్డ్ పాస్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ ఏడాది అత్యంత చెత్త పాస్ వర్డ్ లు ఇవేనంటూ ఓ జాబితా విడుదల చేసింది.

ఈ సంస్థ ప్రతి సంవత్సరం చెత్త పాస్ వర్డ్ లతో జాబితా రిలీజ్ చేస్తుంది. ఇక 2020లో అత్యంత చెత్త పాస్ వర్డ్ 123456 అని వెల్లడించింది. దీన్ని హ్యాకర్లు 2.3 కోట్ల సార్లు ఛేదించారట. దీని తర్వాత స్థానంలో 1234567889 ఉంది. మూడో స్థానంలో picture1 అనే పాస్ వర్డ్ నిలిచింది. ప్రపంచంలో అనేకమంది ఇలా సాధారణమైన పాస్ వర్డ్ లు పెట్టుకుని హ్యాకర్ల బారినపడుతుంటారని నార్డ్ పాస్ వెల్లడించింది.

కొందరు password, 123456, qwerty అంటూ సులభంగా గుర్తుంచుకునేలా పాస్ వర్డ్ లు వాడుతుంటారని, ఇలాంటి వాటితో హ్యాకింగ్ ప్రమాదం ఎక్కువని స్పష్టం చేసింది. పాస్ వర్డ్ బలంగా ఉండాలంటే అందులో అప్పర్, లోయర్ కేస్ లతో అక్షరాలు, నెంబర్లు, సంజ్ఞలు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. అంతేకాదు ప్రతి 3 నెలలకోసారి పాస్ వర్డ్ మార్చాల్సి ఉంటుందని వెల్లడించింది.  

More Telugu News