సోనూసూద్ బాటలో టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్!

22-11-2020 Sun 13:27
  • ఓ బాబు బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నాడని నెటిజన్ ట్వీట్
  • ఆమె కుటుంబ సభ్యుల వీడియో పోస్ట్
  • స్పందించిన మనోజ్
  • వివరాలు తెలపాలని ట్వీట్
HeroManoj Please send me all the details to my inbox

ఓ బాబు బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నాడని, ఆమె కుటుంబ సభ్యులు చికిత్స చేయించే స్థితిలో లేరని తెలుపుతూ నందమూరి ఫ్యాన్స్, సోనూసూద్ కి ఒక నెటిజన్ చేసిన ట్వీట్ ను టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రీట్వీట్ చేశాడు. అందులో మనోహర్ బాబు అనే వ్యక్తి మాట్లాడుతూ తాము ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నామని తన భార్య,పిల్లాడితో కలిసి కన్నీరు కారుస్తూ చెప్పాడు. వారికి సాయం చేస్తానని మంచు మనోజ్ చెప్పాడు.

‘దయచేసి నా ఇన్‌బాక్స్‌కి అన్ని వివరాలు పంపండి. ఆసుపత్రి పేరు, వైద్యుల పేర్లు కూడా పంపండి. ధైర్యంగా ఉండండి. ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని మంచు మనోజ్ ప్రకటించాడు. దీంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ ఆయనను మరో సోనూసూద్ అని కొనియాడుతున్నారు.

‘ఇంత త్వరగా రియాక్షన్ అసలు ఎవరు ఊహించి ఉండరు అన్న. సమాజానికి ఏం జరిగినా సమాజంలో ఏం జరిగినా ముందు ఉండేది నువ్వే సామి. నీ మానవత్వానికి మనుషులు శిరస్సు వంచి జీవితాంతం నువ్వు బాగుండాలి అని కోరుకుంటున్నారు మనోజ్ అన్న’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.