నాకు ఏ రాజకీయ పార్టీతో.. ఏ రాజకీయాలతోనూ సంబంధం లేదు: బండ్ల గణేశ్

22-11-2020 Sun 10:39
  • నేను రాజకీయాలకు దూరం
  • గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు
  • ఇది నా అభ్యర్థన
Bandla Ganesh  says dont write fake news

సామాజిక మాధ్యమాల్లో తన గురించి వస్తోన్న వార్తలపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తాను రాజకీయాల్లో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలను కొందరు ఇప్పుడు పోస్ట్ చేస్తుండడం పట్ల ఆయన స్పందిస్తూ ఇటువంటి పోస్టులు చేయొద్దని కోరారు. ప్రస్తుతం తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెప్పారు.

‘నాకు ఏ రాజకీయ పార్టీతో, ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేశ్’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.