తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

22-11-2020 Sun 09:19
  • 24 గంటల్లో 873 కరోనా కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,63,526
  • 2,50,453 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,430
873 new cases in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో 873 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,296 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,63,526 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,50,453 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,430 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 11,643 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 9,345 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 71 కేసులు నిర్ధారణ అయ్యాయి.