అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో.. పబ్‌లో పూటుగా మద్యం తాగి కారుతో రోడ్డెక్కి బీభత్సం!

22-11-2020 Sun 08:17
  • భయభ్రాంతులకు గురైన వాహనదారులు
  • ఇండియా కారులోని ఇద్దరికి తీవ్ర గాయాలు
  • నిందితులు హార్దిక్ రెడ్డి, అఖిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Car accident in Bajara Hills two arrested

పబ్‌లో పూటుగా మద్యం తాగిన ఇద్దరు యువకులు బెంజ్‌కారుతో రోడ్డెక్కి బీభత్సం సృష్టించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిందీ ఘటన. సమీపంలోని ఓ పబ్‌లో మద్యం తాగిన హార్దిక్‌రెడ్డి, అఖిల్ ప్రమోద్‌లు బెంజ్ కారుతో రోడ్డుపైకి వచ్చారు. అతి వేగంగా డ్రైవ్ చేస్తూ తోటి వాహనదారులను బెంబేలెత్తించారు.

అదే వేగంతో వెళ్తూ ఇండికా కారును ఢీకొట్టారు. కారు బలంగా ఢీకొట్టడంతో అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితులు హార్దిక్‌రెడ్డి, అఖిల్ ప్రమోద్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.