పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదు: టీఆర్ఎస్ నేత స్వామి గౌడ్

22-11-2020 Sun 06:41
  • బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలను కలిసిన స్వామిగౌడ్
  • పార్టీ మార్పుపై మొదలైన ఊహాగానాలు
  • పార్టీ మారితే చెబుతానన్న స్వామిగౌడ్
I will tell if i joins in BJP says swamy goud

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో చేరికలు పెరిగాయి. కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ నుంచి కూడా పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు పార్టీలో చేరికకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్..  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది.

ఈ వార్తలపై స్వామిగౌడ్ స్పందించారు. పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదని, ఏదైనా ఉంటే ముందు మీడియాకు చెబుతానని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలను కలవకూడదన్న నిబంధనేమీ లేదని, తాను వారిని స్నేహపూర్వకంగానే కలిసినట్టు స్వామిగౌడ్ వివరించారు.