మహేశ్ బాబు అభిమానులకు ఇది కచ్చితంగా పెద్ద ట్రీట్: పూరీ జగన్నాథ్

21-11-2020 Sat 18:08
  • లాంఛనంగా ప్రారంభమైన సర్కారు వారి పాట
  • మహేశ్ బాబు, పరశురాం కాంబోలో కొత్త చిత్రం
  • ముంబయిలో ఉండడంతో రాలేకపోయానన్న పూరీ
Puri Jagannath describes Sarkaru Vaari Paata will be a huge treat for Mahesh Babu fans

మహేశ్ బాబు, పరశురాం కాంబినేషన్లో ఇవాళ సర్కారు వారి పాట చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దీనిపై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు.

"కంగ్రాచ్యులేషన్స్ పరశురాం. అత్యంత ఉద్విగ్నత కలిగించే ఆసక్తికర ప్రాజెక్టు సర్కారు వారి పాటతో ముందుకు వెళుతున్నందుకు శుభాభినందనలు. నేను ముంబయిలో ఉండిపోవడంతో ఈ సినిమా పూజా కార్యక్రమాలకు రాలేకపోయాను. నా ప్రేమాభిమానాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. సర్కారు వారి పాట చిత్రబృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కచ్చితంగా మహేశ్ బాబు అభిమానులందరికీ పెద్ద ట్రీట్ అవుతుంది" అంటూ ట్వీట్ చేశారు.