Amit Shah: చెన్నైలో అమిత్ షాపై ప్లకార్డు విసిరిన వ్యక్తి

Chennai man throws placard on Amit Shah
  • తమిళనాడులో అమిత్ షా పర్యటన
  • గో బ్యాక్ అమిత్ షా అంటూ రాసిన ప్లకార్డు విసిరిన వ్యక్తి
  • పోలీసుల అదుపులో చెన్నై వాసి దురైరాజ్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ చెన్నైలో పర్యటించారు. రెండ్రోజుల తమిళనాడు పర్యటన కోసం ఆయన ఇవాళ చెన్నై వచ్చారు. విమానాశ్రయం నుంచి వెలుపలికి వచ్చిన ఆయన కాలినడకన పార్టీ శ్రేణులకు, ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అయితే జీఎస్టీ రోడ్డు వద్ద అమిత్ షాపై ఓ వ్యక్తి గో బ్యాక్ అమిత్ షా అని రాసి ఉన్న ప్లకార్డును విసిరాడు. దాంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆ ప్లకార్డును అందుకున్నారు. దాన్ని విసిరిన వ్యక్తిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని చెన్నైకి చెందిన 67 ఏళ్ల దురైరాజ్ అని గుర్తించారు.
Amit Shah
Placard
Chennai
Durairaj
Police

More Telugu News