తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో యాంకర్ సుమ భేటీ!

21-11-2020 Sat 12:48
  • ట్విట్టర్ లో తెలిపిన సుమ
  • కేటీఆర్‌తో మాట్లాడడం పట్ల సంతోషంగా ఉందని వ్యాఖ్య
  • ఆయన నాయకత్వంపై ప్రశంసలు
suma meets ktr

తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో యాంకర్ సుమ భేటీ అయింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. కేటీఆర్‌తో మాట్లాడడం పట్ల సంతోషంగా ఉందని సుమ తెలిపింది. తన షోల్లో తాను ఏదేదో మాట్లాడేస్తుంటానని, కానీ, కేటీఆర్ గొప్ప నాయకత్వం తనను శ్రద్ధతో వినేలా చేసిందని చెప్పింది.

ప్రకటనలు చేయడం, నిబద్ధతతో పనిచేస్తూ, వాటిని అమలు చేస్తూ వెళ్లే ఆయన మార్గం అద్భుతమని సుమ ప్రశంసించింది. అయితే, తాను కేటీఆర్‌తో ఏ విషయంపై చర్చించానన్న విషయాన్ని మాత్రం సుమ ప్రకటించలేదు. కేటీఆర్‌తో భేటీ అయిన సందర్భంగా తీసుకన్న ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. యాంకరింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న సుమ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నడుపుతోంది. తన కుమారుడిని సినిమాల్లోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు కూడా చేస్తోంది.