ఈ రోజు ఉదయం నా కూతురు అర్హకు ఇలా సర్‌ప్రైజ్ ఇచ్చాను: అల్లు అర్జున్

21-11-2020 Sat 11:01
  • గుర్రంపై కూర్చోబెట్టిన అల్లు అర్జున్
  • పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరో గిఫ్టు
  • ఫొటోలు పోస్ట్ చేసిన బన్నీ
Allu Arjun Small Surprise in the morning for the bday baby

ఈ రోజు ఉదయం తన కూతురు అర్హకు సర్‌ప్రైజ్ ఇచ్చానని హీరో అల్లు అర్జున్ చెప్పాడు. ఈ రోజు అల్లు అర్జున్ కూతురు అర్హ తన పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెను గుర్రంపై కూర్చోబెట్టాడు అల్లు అర్జున్. అంతేకాకుండా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెకు ఓ గిఫ్టును కూడా  ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ పోస్ట్ చేశాడు. అల్లు అర్హ నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఐదో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. తన కూతురికి సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ తరుచూ పోస్ట్ చేస్తుంటాడు. 'అల వైకుంఠపురములో' సినిమాతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు.