Sonia Gandhi: డాక్టర్ల సలహా మేరకు గోవా వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా

Sonia Gandhi arrives Goa along with Rahul Gandhi
  • ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సోనియా
  • ఢిల్లీ కాలుష్యంతో మరింత నష్టం జరుగుతుందన్న డాక్టర్లు
  • రాహుల్ తో కలిసి పనాజీ చేరుకున్న సోనియా
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్య రీత్యా ఢిల్లీలో ఉండడం శ్రేయస్కరం కాదని వైద్యులు చెప్పడం తెలిసిందే. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉన్న నేపథ్యంలో డాక్టర్లు ఈ మేరకు హెచ్చరిక చేశారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సోనియా కొన్నిరోజుల పాటు ఢిల్లీకి వెలుపల ఉండాలని సూచించారు. ఈ క్రమంలో సోనియా గాంధీ హస్తినను వీడి గోవా చేరుకున్నారు.

పనాజీ వచ్చిన ఆమె వెంట తనయుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఇక్కడి దబోలియ్ ఎయిర్ పోర్టు నుంచి వారు దక్షిణ గోవాలోని ఓ రిసార్టుకు వెళ్లారు. వారు ఇక్కడే కొన్నిరోజుల పాటు ఉంటారు.

లాక్ డౌన్ సమయంలో సోనియా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆమె ఆగస్టు 2న డిశ్చార్జి అయ్యారు. అయితే, ఢిల్లీ కాలుష్యంతో సోనియా ఛాతీ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోవడం కష్టమని గంగారామ్ ఆసుపత్రి వైద్యులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఢిల్లీ వెలుపల కొన్నిరోజులు గడపాలని స్పష్టం చేశారు.
Sonia Gandhi
Goa
Rahul Gandhi
Chest Infection
New Delhi
Doctors

More Telugu News