తమిళనాట భారీ స్థాయిలో రిలీజైన మహేశ్ సినిమా

20-11-2020 Fri 16:39
  • సంక్రాంతికి వచ్చిన మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు'  
  • 'ఇవనుక్కు సరియాన ఆల్లాయ్' పేరిట డబ్బింగ్ 
  • మొత్తం 220 థియేటర్లలో నేడు గ్రాండ్ రిలీజ్  
Mahesh Babus dubbed film released in Tamilanadu today

మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తెలుగు నాట ఘనవిజయాన్ని సాధించింది. ప్రముఖ నటి విజయశాంతి కీలక పాత్రలోను.. రష్మిక మందన్న కథానాయికగానూ నటించిన ఈ చిత్రం మంచి ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను బాగా అలరించింది. ఇప్పుడీ చిత్రాన్ని 'ఇవనుక్కు సరియాన ఆల్లాయ్' పేరిట తమిళంలోకి అనువదించారు.

ఇక ఈ చిత్రాన్ని ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ చిత్రం తమిళనాడు డ్రిస్ట్రిబ్యూటర్ వెంకటేశ్ తమ 'ఏవీ మీడియా' బ్యానర్ పై దీనిని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 220 థియేటర్లలో విడుదల చేయడం విశేషం. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తమిళ అగ్ర హీరోల చిత్రాల రిలీజ్ లు ఏవీ లేకపోవడం వల్ల దీనికి థియేటర్లు బాగా దొరికాయి. మరి, ఈ కోవిడ్ నేపథ్యంలో రిలీజైన ఈ చిత్రానికి అక్కడ ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ లభిస్తుందో చూడాలి!