Janasena: 'గ్రేటర్' బరి నుంచి తప్పుకున్న జనసేన... ఒక్క ఓటు కూడా పోకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలన్న పవన్ కల్యాణ్

Janasena withdraws from GHMC elections

  • హైదరాబాదులో బలమైన నాయకత్వం ఉండాలన్న పవన్
  • కార్యకర్తలకు ఇష్టంలేకున్నా తప్పుకుంటున్నామని వెల్లడి
  • బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటన

హైదరాబాదులో నాదెండ్ల మనోహర్ నివాసంలో జనసేన, బీజేపీ అగ్రనేతల సమావేశం ముగిసింది. జనసేనాని పవన్ కల్యాణ్ తో కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ సమావేశమై జీహెచ్ఎంసీ ఎన్నికల విషయమై చర్చించారు. బీజేపీ నేతలు జనసేన మద్దతు కోరగా, పవన్, నాదెండ్ల అందుకు సమ్మతించారు. భేటీ అనంతరం పవన్ స్పందిస్తూ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇకపై ఏపీలో మాదిరే తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.

తగినంత సమయం లేకపోవడంతో పాటు కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా పొత్తు పెట్టుకోలేకపోయామని అన్నారు. బీజేపీతో కలిసి పనిచేయడంపై రోడ్ మ్యాప్ రూపొందిస్తామని జనసేనాని వివరించారు. హైదరాబాదులో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే తమ కార్యకర్తలకు ఇష్టంలేకపోయినా జీహెచ్ఎంసీ బరి నుంచి తప్పుకుంటున్నామని చెప్పారు. ఒక్క ఓటు కూడా పోకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలని పవన్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News