YSR: నాడు తండ్రి వైఎస్, నేడు తనయుడు జగన్... ఒకే చోట తుంగభద్రమ్మకు పూజలు!

Tungabhadra Pushkarams Starting from Today Jagan Will Join where His Father YSR before 12 years

  • 2008, డిసెంబర్ 11న సంకల్ భాగ్ ఘాట్ కు వైఎస్
  • నేడు అదే ఘాట్ లో పుష్కరాలకు రానున్న వైఎస్ జగన్
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

అది 2008 సంవత్సరం, డిసెంబర్ 11. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు నగరంలోని సంకల్ భాగ్ ఘాట్ కు వచ్చారు. నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. పుష్కరాలు డిసెంబర్ 10న ప్రారంభం కాగా, 11న సీఎం హోదాలో ఆయన పర్యటించారు. ఆపై పుష్కరకాలం తరువాత మరోసారి తుంగభద్రమ్మకు మరోసారి పండగొచ్చింది.

నాడు తండ్రి పూజలు నిర్వహించిన సంకల్ భాగ్ ఘాట్ లోనే నేడు తనయుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఈ మధ్యాహ్నం కర్నూలు చేరుకునే జగన్, 1.10 గంటలకు పుష్కరాలను అధికారికంగా ప్రారంభిస్తారు. జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇక పుష్కరాల్లో పాల్గొనాలని భావించే వారు ముందుగా ఈ టికెట్ ను https://tungabhadrapushkaralu 2020.ap.gov.in వెబ్ సైట్ నుంచి బుక్ చేసుకోవాల్సి వుంటుంది. మొత్తం 23 పుష్కర ఘాట్లు ఉండగా, ఏ ఘాట్ కు వెళ్లేదీ ముందుగా తెలియజేయాల్సి వుంటుంది. చిన్నారులకు, వృద్ధులకు మాత్రం స్లాట్ బుక్ చేసుకునేందుకు అనుమతి లేదు.

  • Loading...

More Telugu News