సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

20-11-2020 Fri 07:22
  • మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న రకుల్ 
  • బాలకృష్ణ, బోయపాటి సినిమా అప్ డేట్ 
  • ఎన్టీఆర్ సినిమాలో ఢిల్లీ భామ కేతిక   
Rakul Preeth Singh spends her holiday in Maldives

*  షూటింగుల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హాలిడే ఎంజాయ్ చేస్తోంది. కుటుంబ సభ్యులతో కలసి నిన్న మాల్దీవులకు వెళ్లిన ఈ చిన్నది అక్కడ కొన్ని రోజుల పాటు సరదాగా గడిపి వస్తుందట. మరోపక్క కాజల్ అగర్వాల్ కూడా భర్తతో కలసి మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న సంగతి విదితమే.
*  బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ నేటి నుంచి జరుగుతుంది. బాలయ్యతో పాటు కథానాయికలు సాయేషా సైగల్, పూర్ణ కూడా షూటింగులో పాల్గొంటారు.
*  ప్రస్తుతం ఆకాశ్ పూరి సరసన 'రొమాంటిక్' చిత్రంలోను, నాగశౌర్య సినిమాలోనూ నటిస్తున్న ఢిల్లీ భామ కేతిక శర్మ త్వరలో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ కనిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే చిత్రంలో ఓ హీరోయిన్ గా కేతిక శర్మను తీసుకునే ఆలోచన చేస్తున్నారట.