అక్కినేని హీరో సినిమాలో రష్మిక!

19-11-2020 Thu 21:44
  • అఖిల్ తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'
  • సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నాలు 
  • సురేందర్ రెడ్డితో అఖిల్ తదుపరి చిత్రం  
Rashmika to romance with Akhil

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అఖిల్ కి ఇంతవరకు సరైన హిట్టు ఒక్కటి కూడా లేదు. అయినా, వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం తన నాలుగో సినిమాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ హాట్ హీరోయిన్ పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదిలావుంచితే, తన ఐదో చిత్రాన్ని అఖిల్ ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో కథానాయికగా నేటి బిజీ స్టార్ హీరోయిన్ రష్మిక నటించనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని సమాచారం. సురేందర్ రెడ్డి సినిమా అంటే యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి ఆ రేంజిలోనే బడ్జెట్టు కూడా వుంటుందట.