హైదరాబాద్ షూటింగులో గాయపడ్డ హీరో అజిత్

19-11-2020 Thu 19:49
  • డూప్ లేకుండా బైక్ తో రిస్కీ స్టంట్ చేసిన అజిత్
  • చేతులకు, కాళ్లకు గాయాలు
  • నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు
Actor Ajith met with accident in shooting

తమిళ స్టార్ హీరో అజిత్ గాయపడ్డారు. హైదరాబాదులో జరుగుతున్న 'వలిమై' షూటింగ్ సందర్భంగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. డూప్ లేకుండా బైక్ తో రిస్కీ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అజిత్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అజిత్ గాయపడ్డారనే వార్తతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అజిత్ గాయపడటంతో షూటింగుకు కొన్ని రోజుల పాటు దూరం కానున్నాడు.

'వలిమై' సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో అజిత్ కు జోడిగా హుమా ఖురేషి నటిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలు ఎత్తేయడంతో... కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ నిర్వహిస్తున్నారు.