'సామ్ జామ్' వేదికపై చిరంజీవి... స్టయిలిష్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్

19-11-2020 Thu 14:01
  • 'సామ్ జామ్' కార్యక్రమాన్ని లాంచ్ చేసిన 'ఆహా' ఓటీటీ
  • చిరంజీవితో స్పెషల్ టాక్ షో
  • మెగాస్టార్ ను ఇంటర్వ్యూ చేయనున్న సమంత
Megastar Chiranjeevi attends to SamJam shoot

అతి తక్కువ సమయంలోనే విశేష ప్రజాదరణ పొందిన 'ఆహా' ఓటీటీ వేదిక వినూత్నమైన కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఇటీవలే  'సామ్ జామ్' పేరిట ఓ టాక్ షోను ప్రారభించింది.  ఈ స్పెషల్ టాక్ షోకు అందాలభామ సమంత హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేయనుంది.

తాజాగా, 'సామ్ జామ్' షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన అన్నపూర్ణ స్టూడియోకు రాగా కెమెరాలు క్లిక్ మన్నాయి. సరికొత్త లుక్ తో చిరంజీవి ఆకర్షణీయంగా కనిపిస్తుండడం ఈ ఫొటోల్లో చూడొచ్చు. బ్లేజర్, డెనిమ్ ప్యాంట్స్ లో స్లిమ్ గా ఉన్న చిరంజీవి సామ్ జామ్ వేదికపై తళుక్కుమన్నారు.