14 రోజుల పాటు క్వారంటైన్‌లోకి హీరో సల్మాన్ ఖాన్!

19-11-2020 Thu 11:38
  • సల్మాన్ ఖాన్ డ్రైవరుకు కరోనా
  • మరో ఇద్దరు ఉద్యోగులకు కూడా పాజిటివ్ నిర్ధారణ
  • కుటుంబ సభ్యుల నుంచి దూరంగా సల్మాన్
salman khan goes to home quarantine

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డ్రైవరుతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో 14 రోజుల పాటు సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యుల నుంచి దూరంగా క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, సల్మాన్ తండ్రి సలీం ఖాన్, సల్మా ఖాన్ ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా జరగబోయే వేడుకను రద్దు చేశారు.

కరోనా నిర్ధారణ అయిన తన సిబ్బందిని సల్మాన్ ఖాన్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందేలా చేస్తున్నారు. కాగా, దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల కొన్ని నెలలుగా సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి పన్వెల్ లోని ఫాంహౌస్ లోనే ఉన్నారు. అక్కడే వ్యవసాయ పనుల్లో పాల్గొంటూ వీడియోలు తీసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.