నీ సంకల్పానికి శాల్యూట్.. నయనతారకు సమంత విషెస్!

18-11-2020 Wed 16:38
  • రెండు దశాబ్దాలుగా అగ్రతారగా రాణిస్తున్న నయన్ 
  • ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న ముద్దుగుమ్మ
  • 'మాలాంటి వాళ్లకు నువ్వు స్ఫూర్తి' అన్న సమంత
  • 'హ్యాపీ బర్త్ డే బంగారం' అంటూ ప్రియుడి విషెస్    
Samanthas Birthday wishes to Nayanatara

సుమారు రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ సినిమాలలో అగ్రతారగా రాణిస్తున్న కథానాయిక నయనతార. తన తర్వాత ఎంతమంది కొత్త కథానాయికలు వచ్చినప్పటికీ, తన జైత్రయాత్రను మాత్రం ఆమె ఇంకా కొనసాగిస్తూనే వుంది. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా ఆమె దక్షిణాదిన పేరుతెచ్చుకుంది. తాజాగా వచ్చిన తమిళ చిత్రం 'మూకితి అమ్మన్' (తెలుగులో అమ్మోరు తల్లి) చిత్రానికి ఏకంగా నాలుగు కోట్లు తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

అలాంటి అందాల నయనతార ఈ రోజు తన బర్త్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ కోవలో మరో అగ్రతార సమంత సోషల్ మీడియా వేదికగా ఆమెకు చెప్పిన విషెస్ ఆసక్తికరంగా వున్నాయి. 'నయనతార సిస్టర్ కు హ్యాపీ బర్త్ డే.. నువ్వు ఇంకా రాణిస్తూనే ఉండాలి.. మాలాంటి వాళ్లకు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉండాలి.. నీ శక్తికి, సంకల్పానికి శాల్యూట్ సిస్టర్' అంటూ సమంత విషెష్ చెప్పింది.

ఇక నయనతార ప్రియుడు, కాబోయే భర్త అయిన దర్శకుడు విఘ్నేశ్ శివన్ అయితే, 'హ్యాపీ బర్త్ డే బంగారం' అంటూ విషెస్ చెప్పాడు.