Gorati Venkanna: ముగ్గురు ఎమ్మెల్సీల చేత ప్రమాణస్వీకారం చేయించిన తెలంగాణ శాసనమండలి ఛైర్మన్

3 new TS MLCs take oath

  • ప్రమాణ స్వీకారం చేసిన వెంకన్న, దయానంద్, సారయ్య
  • గత ఆగస్టులోనే ఖాళీ అయిన మూడు స్థానాలు
  • సీఎంకు ధన్యవాదాలు చెప్పిన తాజా ఎమ్మెల్సీలు

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యలు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. వీరి చేత టీఎస్ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. రాములు నాయక్, కర్నె ప్రభాకర్, దివంగత నాయిని నర్సింహారెడ్డిల పదవీ కాలపరిమితి ముగియడంతో... గత ఆగస్టు నాటికే మండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంకన్న, దయానంద్, సారయ్యలను ఎంపిక చేశారు. మరోవైపు, తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి తాజా ఎమ్మెల్సీలు ధన్యవాదాలు తెలిపారు.

Gorati Venkanna
MLC
KCR
TRS
  • Loading...

More Telugu News