తన ఫేవరెట్ హీరోను కలవాలన్న కలను నెరవేర్చుకున్న క్రికెటర్ వరుణ్!

18-11-2020 Wed 10:40
  • హీరో విజయ్‌ను కలిసిన క్రికెటర్ 
  • విజయ్‌తో కలిసి ఫొటోలు
  • ‘మాస్ట‌ర్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్య
varun meets vijay

తన అభిమాన హీరో విజయ్‌ను క్రికెటర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి కలిసి తన కలను నెరవేర్చుకున్నాడు. ఆయనతో కలిసి ఫొటోలు దిగి ఎంజాయ్ చేశాడు. ఈ విషయాన్ని తెలుపుతూ వరుణ్ ఓ పోస్ట్ చేశాడు. తన అభిమాన హీరో విజ‌య్ న‌టించిన ‘మాస్ట‌ర్’ సినిమా విడుదల కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వరుణ్ తెలిపాడు.

కాగా, ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున వరుణ్ చక్రవర్తి ఆడిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో సినిమా షూటింగులు, విడుదలకు బ్రేక్ రావడంతో మాస్టర్ సినిమా విడుదల ఆలస్యమైంది. ఆ సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.