Maharashtra: మా నాన్న డిగ్రీ పాసయ్యారోచ్!.. ‘మహా’ మంత్రి ఏక్‌నాథ్ షిండే తనయుడి ట్వీట్

Maharashtra Minister A Degree Holder Now

  • ఉద్ధవ్ కేబినెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న షిండే
  • ఓపెన్ యూనివర్సిటీ నుంచి 77.25 శాతం మార్కులతో ఉత్తీర్ణత 
  • కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదన్న కుమారుడు

మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే ఇప్పుడు డిగ్రీ పట్టభద్రుడు. యశ్వంత్‌రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ నుంచి 77.25 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్టు ఆయన తనయుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్ ట్వీట్ చేశారు. కుటుంబ పోషణ కోసం తన తండ్రి చిన్నప్పుడే చదువును వదిలిపెట్టాల్సి వచ్చిందని పేర్కొన్న శ్రీకాంత్.. ఇప్పుడు ఆర్ట్స్ విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు. పట్టుదలతో కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదని తన తండ్రి నిరూపించారని పేర్కొన్నారు.

శివసేన చీఫ్ బాలాసాహెబ్ థాకరే స్మారక దినోత్సవం సందర్భంగా శివాజీ పార్క్‌ను సందర్శించిన మంత్రి ఏక్‌నాథ్ మాట్లాడుతూ.. తన కుమారుడు డాక్టర్ అయ్యాడని, తన విద్య మాత్రం అసంపూర్తిగా మిగిలిపోయిందని అన్నారు. విద్య ప్రాముఖ్యత అందరికీ తెలిసిందేనని, తనకు కూడా గ్రాడ్యుయేట్‌ను కావాలన్న కోరిక మనసులో బలంగా ఉండేదని పేర్కొన్నారు. సమయానికి అనుగుణంగా చదువుకుంటూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించానని, ఇప్పుడు ఫైనల్ ఇయర్ పరీక్షల్లోనూ పాసయ్యానని మంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News