జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం: పవన్ కల్యాణ్
- యువ కార్యకర్తల విన్నపం మేరకు పోటీ చేయాలని నిర్ణయించాం
- పోటీ చేసే విషయంపై పలు విన్నపాలు వచ్చాయి
- పోటీకి సిద్ధం కావాలని నేతలకు, కమిటీలకు స్పష్టం చేశాను
తన వద్దకు వచ్చిన కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై చర్చించుకున్నారని పవన్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ, ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. వారి అభీష్టానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ ఎన్నికలలో అభ్యర్థులను జనసేన నిలుపుతుందని చెప్పారు.