కొత్త హెయిర్ స్టయిల్‌తో హీరో మహేశ్ బాబు లుక్ వైరల్!

17-11-2020 Tue 10:20
  • పోస్ట్ చేసిన నమ్రత
  • తెల్లవారు జామున 3 గంటలకు ఫొటో క్లిక్
  • విమానం కోసం ఎదురుచూస్తోన్న మహేశ్ బాబు  
mahesh  pic goes viral

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఆయన భార్య నమ్రత ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అందిస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా పోస్ట్ చేసిన మహేశ్ బాబు కొత్త లుక్ వైరల్ అవుతోంది. 'తెల్లవారు జామున 3 గంటలకు విమానం కోసం ఎదురుచూస్తోన్న మహేశ్ బాబు' అంటూ ఆమె ఈ ఫొటోను పోస్ట్ చేసింది. కొత్త హెయిర్ స్టైల్ లో మహేశ్ బాబు చాలా యంగ్ గా కనపడుతోన్న తీరు ఆకట్టుకుంటోంది.    

వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా, యంగ్ గా కనపడుతున్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలావుంచితే, కరోనా వైరస్ విజృంభణ వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్న మహేశ్ బాబు మళ్లీ ఓ యాడ్ రూపంలో ఇటీవలే కెమెరా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా టూర్ కి వెళ్లి ఎంజాయ్ చేశాడు.