సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

17-11-2020 Tue 07:28
  • తెలుగు నేర్చుకుంటున్న మలయాళ భామ 
  • మల్టీ స్టారర్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న అనిల్
  • 'నారప్ప' కోసం కీలక సన్నివేశాల చిత్రీకరణ  
Nazria Fahad learning Telugu to dub herself

*  నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. మలయాళ భామ నజ్రియా ఫహాద్ ఇందులో కథానాయికగా నటిస్తుంది. విశేషం ఏమిటంటే, నజ్రియా తన పాత్రకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటుందట. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు నేర్చుకుంటోందని సమాచారం
*  ఆమధ్య 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి త్వరలో అక్కినేని హీరోలతో ఓ మల్టీ స్టారర్ చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. నాగార్జున, అఖిల్ కలసి నటించే చిత్రానికి అనిల్ దర్శకత్వం వహిస్తాడనీ, ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుగుతోందని తెలుస్తోంది.
*  వెంకటేశ్ కథానాయకుడుగా నటిస్తున్న 'నారప్ప' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. వెంకటేశ్ సహా చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొన్న ఓ కీలక సన్నివేశం చిత్రీకరణను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల నిన్నటితో పూర్తిచేశాడట.