CBI: హైకోర్టు జడ్జిలపై అసభ్యకర పోస్టుల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు
![CBI registers case in derogatory remarks on judges case](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-8f9cd1cff05c.jpg)
- మొదట ఈ కేసును సీఐడీకి అప్పగించిన హైకోర్టు
- 17 మందిపై కేసులు నమోదు చేసిన సీఐడీ
- సీఐడీ విచారణ తీరుపై హైకోర్టు అసంతృప్తి
- సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర రీతిలో పోస్టులు చేయడం పట్ల సీబీఐ కేసులు నమోదు చేసింది. న్యాయ వ్యవస్థలో తీవ్ర కలకలం రేపిన ఈ వ్యవహారాన్ని మొదట ఏపీ సీఐడీకి అప్పగించగా, హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ 17 మందిపై కేసులు నమోదు చేసింది. అయితే సీఐడీ విచారణ పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు స్వీకరించాలంటూ సీబీఐని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ... సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించింది. అనంతరం ఈ అంశానికి సంబంధించి విశాఖలో 12 కేసులను రిజిస్టర్ చేసింది.