Koppula Eshwar: పెళ్లి చేసుకుంటున్న పేద యువతికి ఆర్థికసాయం చేసిన తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్

Telangana minister Koppula Eshwar helps a poor girl
  • అర్ధాంగితో కలిసి మంత్రి ఈశ్వర్ సామాజిక సేవ
  • కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు
  • పేద యువతి అంజలికి రూ.15 వేలు నగదు సాయం
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ సామాజిక స్పృహ మెండుగా ఉన్న వ్యక్తి. ఆయన తన అర్ధాంగి స్నేహలత సాయంతో కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా, పెద్దపల్లి జిల్లా ధర్మారం  గ్రామానికి చెందిన కాల్వ అంజలి అనే అమ్మాయి పెళ్లి చేసుకుంటుండగా, ఆమెకు ఆర్థికసాయం చేశారు. పేద కుటుంబానికి చెందిన అంజలికి పసుపు-కుంకుమ, పూలు-పండ్లు, పట్టుచీరతో పాటు రూ.15,000 అందించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, తన అర్ధాంగి స్నేహలతతో కలిసి ఆ యువతిని దీవించారు. ఆ యువతి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న మంత్రి ఈ మేరకు సాయం చేశారు.
Koppula Eshwar
Donation
Anjali
Snehalatha
Charitable Trust

More Telugu News