మారుతితో నాని మరో ఎంటర్ టైనర్?

16-11-2020 Mon 13:17
  • గతంలో వచ్చిన 'భలే భలే మగాడివోయ్' హిట్ 
  • తాజాగా మరో సినిమాకి సన్నాహాలు 
  • సిద్ధమవుతున్న వినోదాత్మక స్క్రిప్ట్ 
Nani another movie with Maruti

మొదటి నుంచీ నాని చేస్తున్న సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. రకరకాల కథలతో చేసుకుంటూ వస్తున్నాడు. ఈ కోవలో నాని గతంలో చేసిన సినిమా 'భలే భలే మగాడివోయ్' మంచి హిట్ సినిమాగా నిలిచింది. వినోదమే ప్రధానంగా సాగిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విజయంతో నాని మార్కెట్ కూడా విస్తృతి అయిందనే చెప్పచ్చు.

అయితే, ఈ సినిమా తర్వాత మళ్లీ మారుతి దర్శకత్వంలో నాని మరో సినిమా చేయలేదు. వీరి కాంబోలో సినిమా వస్తుందంటూ గతకొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా, అవి కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ఇప్పుడీ వార్త త్వరలో నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నాని ఓకే చెప్పాడనీ, ఇందుకు కథ కూడా సిద్ధం అవుతోందని తెలుస్తోంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా ఇది రూపొందుతుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది.

ఇదిలావుంచితే, ప్రస్తుతం 'టక్ జగదీశ్' సినిమాలో నటిస్తున్న నాని.. త్వరలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' చిత్రంతో పాటు, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేయనున్నాడు.