Tirumala: రెండు రోజులుగా భారీ వర్షం... తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు!
- మొదటి ఘాట్ రోడ్డులో రాత్రిపూట ప్రమాదం
- 53, 54 మలుపుల మధ్య ఘటన
- వాహనాలు లేకపోవడంతో తప్పిన ప్రమాదం
గడచిన రెండు రోజులుగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. రాత్రి వేళ కొండ చరియలు విరిగిపడిన సమయంలో ఎటువంటి వాహనాల రాకపోకలకు అనుమతి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటన మొదటి ఘాట్ రోడ్డులోని 53, 54 నంబర్ మలుపుల మధ్య జరిగింది. వర్షాలకు కొండ అంచులు బాగా నానిపోయి, రాళ్లు కింద పడ్డాయని అధికారులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే, భారీ బండరాళ్లను అధికారులు జేసీబీ సాయంతో తొలగించి, ఈ ఉదయం నుంచి రాకపోకలకు అనుమతినిచ్చారు.