సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

16-11-2020 Mon 07:18
  • బిజినెస్ లో అడుగుపెడుతున్న పాయల్ 
  • 'సీటీమార్' చివరి షెడ్యూల్ షూటింగ్
  • 'ఎఫ్ 3'లో మరో హీరోగా రవితేజ?  
Payal Rajputh starts clothing brand Goomfy

*  'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ కూడా బిజినెస్ లోకి అడుగుపెడుతోంది. ఇటీవల కథానాయిక సమంత 'సాకి' పేరుతో దుస్తుల బ్రాండును ప్రారంభించిన సంగతి విదితమే. అదే కోవలో ఇప్పుడు పాయల్ 'గూమ్ ఫై' పేరిట దుస్తుల వ్యాపారం చేయనుంది. ఈ విషయాన్ని తనే అధికారికంగా ప్రకటించింది.
*  గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'సీటీమార్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగును ఈ నెల 23 నుంచి హైదరాబాదులో నిర్వహిస్తారు. సింగిల్ షెడ్యూల్ లో దీనిని పూర్తి చేస్తారు. లాక్ డౌన్ కి ముందు జరిగిన షూటింగులో 60 శాతం పూర్తయింది.
*  అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంకటేశ్, వరుణ్ తేజ్ లతో పాటు ఇందులో మరో హీరో కూడా నటిస్తాడని, ఆ పాత్రకు గాను రవితేజను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.