Boris Johnson: బోరిస్‌ను కలిసిన కరోనా రోగి.. రెండోసారి ఐసోలేషన్‌లో బ్రిటన్ ప్రధాని

Britain PM Boris Johnson in Self Isolation

  • ఈ ఏడాది మార్చిలో కరోనా బారినపడి కోలుకున్న బోరిస్ జాన్సన్
  • తనను కలిసిన చట్ట సభ్యుల బృందంలోని వ్యక్తికి కరోనా
  • ముందుజాగ్రత్త చర్యగా స్వీయ నిర్బంధంలోకి..

ఆమధ్య కరోనా బారినపడి విషమ పరిస్థితి ఎదుర్కొని ఆపై బయటపడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ప్రధానిని కలిసిన చట్టసభ్యుల బృందంలోని కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడు లీ అండర్సన్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా బోరిస్ జాన్సన్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. కరోనా రోగిని ప్రధాని కలిసిన నేపథ్యంలో ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

బోరిస్ ఈ ఏడాది మార్చిలో కరోనా మహమ్మారి బారినపడి వైద్యుల పర్యవేక్షణలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోగా మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్న బోరిస్ మళ్లీ బాధ్యతల్లో తలమునకలయ్యారు.

Boris Johnson
Britain
Corona Virus
self isolation
  • Loading...

More Telugu News