Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యేగా ఈ నెల 18న ప్రమాణస్వీకారం చేయనున్న రఘునందన్ రావు

Raghunandan Rao will be taken oath as Dubbaka MLA
  • దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ ఘనవిజయం
  • స్పీకర్ చాంబర్ లో ప్రమాణస్వీకారం
  • రఘునందన్ విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం
ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై ఆయన 1,079 ఓట్లతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో దుబ్బాక శాసనసభ్యుడిగా రఘునందన్ రావు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చాంబర్ లో మధ్యాహ్నం ఒంటిగంటకు రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు.

కాగా, తీవ్రపోటీని తట్టుకుని రఘునందన్ రావు ఎన్నికల్లో జయభేరి మోగించిన నేపథ్యంలో ఆయనకు పార్టీ హైకమాండ్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఆయన విజయంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలే తమ టార్గెట్ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Raghunandan Rao
MLA
Dubbaka
Oath Taking
BJP
Telangana

More Telugu News