Mahesh Babu: దర్శకుడు పరశురామ్ కు బహుమతులు పంపిన మహేశ్ బాబు!

Mahesh Babu Send Gifts to Parasuram

  • పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' 
  • హీరోగా నటిస్టున్న మహేశ్ బాబు
  • దీపావళి సందర్భంగా బహుమతులు

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే చిత్రంలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్, త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. దీపావళి నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు పరశురామ్ కు హీరో మహేశ్ బాబు ప్రత్యేక గిఫ్ట్ లు పంపించారు. ఈ బహుమతిని చూసి ఎమోషనల్ అయిన పరశురామ్, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, "మా సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి ఓ అందమైన బహుమతి. ఈ దీపావళి నా జీవితంలో ప్రత్యేకం. ఈ బహుమతులు పంపినందుకు మీకు, మీ కుటుంబీకులకు నా ధన్యవాదాలు" అని తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News