ఇంద్రగంటి డైరెక్షన్ లో సుధీర్ బాబు రొమాంటిక్ డ్రామా

14-11-2020 Sat 19:16
  • ఇంద్రగంటి, సుధీర్ కాంబినేషన్ లో మూడో చిత్రం
  • గతంలో సమ్మోహనం, వి చిత్రాలు
  • బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై నూతన చిత్రం
Sudheer Babu and Indraganti works again

విలక్షణమైన కథలతో ముందుకు వెళుతున్న యువ హీరో సుధీర్ బాబు మరో కొత్త చిత్రం చేస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ఓ రొమాంటిక్ డ్రామా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. సమ్మోహనం, వి చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. ఇందులో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి కథానాయిక.

బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై  తెరకెక్కబోతున్న ఈ సినిమాకు బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లాపల్లి  నిర్మాతలు. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. అద్భుతమైన టీమ్ మళ్లీ కలుస్తోందని, ఓ అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాం అంటూ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.