Crackers: బాణసంచా కాల్చడంపై ఏయే రాష్ట్రాల్లో... పూర్తి బ్యాన్? షరతులతో నిషేధం? అసలు నిషేధం లేదు?
- కరోనా కారణంగా బాణసంచాపై నిషేధం విధించిన పలు రాష్ట్రాలు
- కొన్ని రాష్ట్రాల్లో షరతులతో కూడిన అనుమతి
- పూర్తిగా అనుమతించిన తమిళనాడు, మధ్యప్రదేశ్
దీపావళి పండుగ అంటేనే ఎక్కడ లేని సందడి ఉంటుంది. పూజలు, పిండి వంటలు, బంధుమిత్రుల కలయికలు, అందమైన దీపాలు, మిరమిట్లు గొలిపే బాణసంచా పేలుళ్లు... ఇవన్నీ కలస్తేనే దీపావళి. కానీ, కరోనా కారణంగా ఈ ఏడాది పలు రాష్ట్రాలు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాయి. ప్రజలు కూడా ఈ ఏడాది బాణసంచా కాల్చడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బాణసంచా షాపులు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ఏయే రాష్ట్రాలు బాణసంచాను కాల్చడాన్ని పూర్తి నిషేధం విధించాయి? ఏయే రాష్ట్రాలు పాక్షిక నిషేధం విధించాయి? టపాసులు కాల్చడాన్ని ఏయే రాష్ట్రాలు అనుమతించాయి? అనే విషయాన్ని తెలుసుకుందాం.
బాణసంచా కాల్చడంపై పూర్తి నిషేధం విధించిన రాష్ట్రాలు: ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, చండీగఢ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, సిక్కిం.
షరతులతో అనుమతించిన రాష్ట్రాలు:
ఆంధ్రప్రదేశ్: రాత్రి 8 నుంచి10 గంటల మధ్యలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు.
తెలంగాణ: రాత్రి 8 నుంచి 10 గంటల వరకు.
కర్ణాటక: గ్రీన్ క్రాకర్స్ మాత్రమే.
ఉత్తరప్రదేశ్: ఓ మోస్తరు గాలి కాలుష్యం ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్ కు మాత్రమే అనుమతి.
బీహార్: ఓ మోస్తరు గాలి కాలుష్యం ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్ కు మాత్రమే అనుమతి.
హర్యానా: నేషనల్ క్యాపిటల్ రీజన్ వెలుపల ఉన్న ప్రాంతాల్లో రెండు గంటలు అనుమతి.
చత్తీస్ గఢ్: రాత్రి 8 నుంచి 10 గంటల వరకు.
జార్ఖండ్: గ్రీన్ క్రాకర్స్ మాత్రమే.
ఉత్తరాఖండ్: కొన్ని నగరాల్లో రెండు గంటల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి.
గుజరాత్: అహ్మదాబాద్ లో కేవలం రెండు గంటల పాటు అనుమతి.
అసోం: రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కు అనుమతి.
పంజాబ్: రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కు అనుమతి.
బాణసంచా కాల్చడానికి పూర్తి అనుమతి ఇచ్చిన రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, తమిళనాడు.