'మహాసముద్రం' మూవీ థీమ్ పోస్టర్ ఇదిగో!

14-11-2020 Sat 14:43
  • ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడి నుంచి మరో సినిమా
  • ఆకట్టుకుంటున్న థీమ్ పోస్టర్
  • 'అపరిమితమైన ప్రేమ' అంటూ ట్యాగ్ లైన్
Mahasamudram theme poster released

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్లో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'మహాసముద్రం'. తాజాగా ఈ సినిమా థీమ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. తాజాగా విడుదల చేసిన థీమ్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. 'అపరిమితమైన ప్రేమ' అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు.

కాగా, 'మహాసముద్రం' చిత్రంపై మొదటి నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి ఎంతో శ్రద్ధగా రాసుకున్న కథతో ఈ చిత్ర రూపుదిద్దుకుంటోంది. తన రెండో చిత్రాన్ని కూడా హిట్ కొట్టాలని భూపతి కసిగా పనిచేస్తున్నాడు. అంతేకాదు, ఎనిమిదేళ్ల తర్వాత సిద్ధార్థ్ ఈ సినిమాతో నేరుగా తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నాడు.