డ్రగ్స్ తో నాకు సంబంధం లేదు: అర్జున్ రాంపాల్

14-11-2020 Sat 12:51
  • నా ఇంట్లో దొరికినవి ప్రిస్క్రిప్షన్ ద్వారా కొన్న మందులు
  • ప్రిస్క్రిప్షన్ ను అధికారులకు అందించాను
  • విచారణకు పూర్తిగా సహకరిస్తా
I have Nothing To Do With Drugs says actor Arjun Rampal

డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాదాపు ఆరు గంటల పాటు విచారించింది. అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో అనుమానిత పదార్థాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఆయనను ఎన్సీబీ నిన్న విచారించింది. విచారణ అనంతరం ఆయన తన నివాసానికి వెళుతూ మీడియాతో మాట్లాడారు.

ఎన్సీబీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని అర్జున్ రాంపాల్ చెప్పాడు. డ్రగ్స్ తో తనకు సంబంధం లేదని తెలిపాడు. తన ఇంట్లో దొరికినవి ప్రిస్క్రిప్షన్ ద్వారా కొన్న మందులని చెప్పాడు. ప్రిస్క్రిప్షన్ ను విచారణ అధికారులకు అందించానని తెలిపాడు. ఎన్సీబీ అధికారులు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారని కితాబునిచ్చారు. వారి విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపాడు.

అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియేలా సోదరుడు అజిసియాలోస్ దిమిత్రియేడ్స్ ను డ్రగ్స్ తో లింకులు ఉన్నాయనే కారణాలతో ఇప్పటికే రెండు సార్లు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అర్జున్ నివాసంలో సోదాలను నిర్వహించారు. అనంతరం అర్జున్ ను, అతని ప్రియురాలిని వేర్వేరుగా విచారించారు.