మానాన్న అల్లు అరవింద్ గారిని చూసి గర్విస్తున్నాను: హీరో అల్లు అర్జున్

14-11-2020 Sat 11:58
  • నిన్న సాయంత్రం జరిగిన గ్రాండ్ ఆహా ఈవెంట్ అద్భుతం
  • తెలుగు ఓటీటీకి గ్రాండ్ ఫాదర్‌గా నా తండ్రి
  • అల్లు కుటుంబానికి ఇది అద్భుతమైన ఈవెంట్
  • ఆహా బృందం మొత్తానికి శుభాకాంక్షలు
I am soo proud of  my father Allu Aravind allu arjun

తెలుగు డిజిటల్ యాప్, ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’  దీపావళి సందర్భంగా నిన్న హైదారాబాద్‌లో భారీ ఈవెంట్ నిర్వహించింది. దీనికి హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై అలరించాడు. పలువురు సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. తెలుగు ఓటీటీ వినోద రంగానికి చిరునామాగా ‘ఆహా’ మారుతోంది.

పూర్తిగా తెలుగు కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు అలరిస్తోంది. అల్లు అరవింద్ కు చెందిన ఈ ఫ్లాట్‌ఫాంలో సరికొత్త కార్యక్రమాలు, తెలుగులో వెబ్ సిరీస్‌లు, సినిమాలు ప్రసారమవుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.
 
*నిన్న సాయంత్రం జరిగిన గ్రాండ్ ఆహా ఈవెంట్ అద్భుతం. తెలుగు ఓటీటీకి గ్రాండ్ ఫాదర్‌గా నిలిచిన మా నాన్న అల్లు అరవింద్‌గారిని చూసి గర్విస్తున్నాను. అల్లు కుటుంబానికి ఇది అద్భుతమైన ఈవెంట్. ఆహా బృందం మొత్తానికి శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.