పెళ్లిపీటలపై నాగ చైతన్య, సాయి పల్లవి.. లవ్‌స్టోరీ పోస్టర్ విడుదల!

14-11-2020 Sat 11:05
  • శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా
  • పెళ్లిపీటలపై కనపడుతోన్న హీరో, హీరోయిన్
  • ఆకర్షిస్తోన్న పోస్టర్
love stoty poster releases

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తోన్న ‘లవ్ స్టోరీ’ సినిమాలోంచి దీపావళి సందర్భంగా ఆ సినిమా యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో, పెళ్లిపీటలపై కనపడుతోన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా  విడుదలకు సిద్ధమవుతోంది.

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన పలు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోమని, థియేటర్లలోనే విడుదల చేస్తామని ఇప్పటికే  ఆ సినిమా బృందం ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సీహెచ్ పవన్ సంగీతం అందిస్తున్నారు.