నాని కొత్త సినిమాలో మలయాళ భామ!

13-11-2020 Fri 16:18
  • ప్రస్తుతం 'టక్ జగదీశ్'లో నటిస్తున్న నాని 
  • 28వ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో 
  • వివేక్ ఆత్రేయ దర్శకత్వం..నజ్రియా నాయిక 
  • 21న టైటిల్ ప్రకటిస్తామన్న నిర్మాణ సంస్థ    
Malayalam heroin in Nanis next movie

మన యంగ్ హీరోలలో నాని ఓ ప్రత్యేకమైన హీరో. చాలా నేచురల్ గా నటిస్తాడు. కొత్త సినిమాల ఎంపికలో సెలక్టివ్ గా ఉంటాడు. ఏదిపడితే అది ఒప్పేసుకోడు.. కథ కొత్తగా వుంటేనే అంగీకరిస్తాడు. ఇక ప్రస్తుతం 'టక్ జగదీశ్' సినిమాలో నటిస్తున్న నాని.. త్వరలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా చేయనున్నాడు. దీనికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తాడు.

ఇదిలావుంచితే, 'శ్యామ్ సింగ రాయ్' తర్వాత నాని తన 28వ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో చేయనున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు సదరు నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఈ చిత్రానికి 'బ్రోచే వారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తాడు.

అలాగే ఇందులో మలయాళ భామ నజ్రియా ఫహద్ కథానాయికగా నటిస్తుంది. ఈ నెల 21న ఈ చిత్రం టైటిల్ని ప్రకటిస్తామని చిత్ర నిర్మాతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ ని చూస్తే, ఈ చిత్రం సంగీత భరిత ప్రేమకథాచిత్రంగా రూపొందుతుందని అనుకోవచ్చు.